ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మంగళవారం ఢిల్లీకి వెళ్లనున్నట్లు తెలిసింది. ఢిల్లీ పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో భేటీ కానున్నట్లు సమాచారం. ఈ సందర్భంగా అమరావతి పునఃప్రారంభానికి ప్రధానిని ఆహ్వానించనున్నట్లు తెలిసింది. అలాగే అమరావతి నిర్మాణానికి ప్రపంచబ్యాంక్ నిధులతో పాటు పలు అంశాలపై చర్చించనున్నారు. మరోవైపు ఢిల్లీ పర్యటనలో హోం మంత్రి అమిత్ షా, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సహా పలువురు కేంద్ర మంత్రులను చంద్రబాబు కలవనున్నట్లు సమాచారం.