తెలంగాణలో పాలిటిక్స్ రోజు రోజకు ఆసక్తికరంగా మారుతున్నాయి. మొన్నటివరకు హైడ్రా కూల్చివేతల అంశం అగ్గిరాజేయగా.. ప్రస్తుతం మూసీ ప్రక్షాళన వ్యవహారం రాజకీయాల్లో మంటలు రగిలిస్తోంది. ఈ క్రమంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.. ఢిల్లీకి పయనమవుతున్నారు. రేపు (నవంబర్ 12న) ఢిల్లీకి వెళ్తున్న కేటీఆర్.. కేంద్ర పెద్దలతో భేటీ కానున్నారు. కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్‌తో కేటీఆర్ సమావేశం కానుండటం ఇప్పుడు సర్వత్రా చర్చనీయాశంగా మారింది.