తెలంగాణలో మరో డిస్కంను సర్కార్ ఏర్పాటు చేసింది. దీనికి సంబంధించి అధికారిక ఉత్తర్వులను విడుదల చేసింది. ఇప్పటికే టీజీఎస్‌పీడీసీఎల్, టీజీఎన్‌పీడీసీఎల్ ఉండగా.. తాజాగా టీజీఆర్‌పీడీసీఎల్‌ను ఏర్పాటు చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ టీజీఎన్‌పీడీసీఎల్ ఛైర్మన్, ఎండీగా ముషారఫ్ అలీ ఫరూఖీని నియమించింది. దాని కార్యకలాపాల పర్యవేక్షణకు మరో నలుగురు డైరెక్టర్లను కేటాయించింది.