Chandrababu Naidu Delhi Tour: రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇవాళ ఢిల్లీకి వెళుతున్నారు. ఆయన 17న ప్రధాని మోదీతో భేటీకానున్నారు. ప్రధానితో పాటుగా పలువురు కేంద్రమంత్రుల్ని కలుస్తారు. ప్రధానంగా ఏపీకి సంబంధించిన అంశాలపై చర్చించనున్నారు. అమరావతి, పోలవరం ప్రాజెక్ట్..వెనుకబడిన జిల్లాలకు నిధులు, రుణాలపై చర్చిస్తారని తెలుస్తోంది. చంద్రబాబు హస్తిన పర్యటన ఆసక్తికరంగా మారింది. ఇటు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఢిల్లీలోనే ఉన్నారు.. ఆయన కూడా గురువారం రాత్రి వెళ్లారు.