News TPCC Chief: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి పయనమయ్యారు. నిన్నటి వరకు విదేశీ పర్యటన చేసి వచ్చిన సీఎం రేవంత్ రెడ్డి.. మళ్లీ ఉన్నట్టుండి ఢిల్లీకి పయనమవటంపై సర్వత్రా ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే.. రేవంత్ రెడ్డి ఈ సడెన్ టూర్‌కు ప్రధాన కారణాలే ఉన్నాయని చెప్తున్నారు కాంగ్రెస్ వర్గీయులు. దిగ్గజ కంపెనీలైన ఆపిల్, ఫ్యాక్స్ కాన్ కంపెనీలతో భేటీతో పాటు కొత్త పీసీసీ చీఫ్, మంత్రి వర్గ విస్తరణ, నామినేటెడ్ పోస్టుల విషయంపై అధిష్ఠానంతో భేటీ కానున్నట్టు తెలుస్తోంది.