Nara Lokesh Prashant Kishor Meet In Delhi: ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్ ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. రైల్వేమంత్రి అశ్విని వైష్ణవ్‌ను కలిశారు. అయితే లోకేష్ ఢిల్లీలో రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్‌తో సమావేశమైనట్లు తెలుస్తోంది. ఇద్దరి భేటీ దాదాపు గంటకుపైగా కొనసాగినట్లు చెబుతున్నారు. తాజా రాజకీయాలపై ఇద్దరు చర్చించనట్లు సమాచారం. అయితే తెలంగాణలో టీడీపీ బలోపేతంపై ప్రశాంత్ కిషోర్‌తో నారా లోకేష్ చర్చించనట్లు తెలుస్తోంది.. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.