కొన్నేళ్ల క్రితం ఏపీకి చెందిన కొందరు మత్స్యకారులు బతుకుదెరువు కోసం గుజరాత్ వలసవెళ్లి.. అక్కడ సముద్రంలో చేపలు పడుతూ.. పొరపాటున పాకిస్తాన్ జలాల్లోకి ప్రవేశించారు. దీంతో పాక్ కోస్ట్ గార్డు వారిని అదుపులోకి తీసుకుని జైళ్లకు తరలించింది. బాధితుల కుటుంబ సభ్యులు కేంద్ర ప్రభుత్వానికి మొరపెట్టుకోగా.. విదేశాంగ శాఖ.. పాక్ అధికారులతో మాట్లాడి.. వారిని సురక్షితంగా విడిపించి స్వస్థలాలకు పంపించింది. అయితే ఇప్పుడు ఇదే నిజజీవిత కథ ఆధారంగా వచ్చిన తండేల్ సినిమా రేపు థియేటర్లలో విడుదల కానుంది. ఈ నేపథ్యంలోనే అసలు ఆ కథ ఏంటి. ఆ మత్స్యకారులు పాకిస్తాన్‌కు ఎలా చిక్కారు. ఆ తర్వాత ఏం జరిగింది. అసలు తండేల్ అంటే ఏంటి అనేది ఈ స్టోరీలో చూద్దాం.