ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో అరెస్టయి బెయిల్ మీద విడుదలైన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత.. నేడు తన తండ్రి కేసీఆర్‌ను.. కలిశారు. ఎర్రవెల్లి ఫాంహౌస్‌లో ఉన్న కేసీఆర్‌ను ఆమెనే స్వయంగా వెళ్లి కలిశారు. ఐదున్నర నెలల తర్వాత తన తండ్రిని చూసిన కవిత.. ఆయన కాళ్లు మొక్కి ఆశీర్వాదం తీసుకున్నారు. కాళ్ల మీద పడిన తన కుమార్తెను కేసీఆర్ గుండెలకు హత్తుకుని ఎమోషనల్ అయ్యారు. అయితే.. రానున్న పది రోజుల పాటు కవిత.. తండ్రితోనే ఉండి భవిష్యత్ కార్యాచరణపై ఆలోచనలు చేయనున్నట్టు తెలుస్తోంది.