హైదరాబాద్ మెట్రో రైలులో ప్రయాణికుల సంఖ్య పెరుగుదల, తరుగుదలలు కన్పిస్తున్నాయి. కొన్ని మార్గాల్లో ప్రయాణికుల సంఖ్య ఆశించిన స్థాయిలో లేదు. రద్దీ సమయంలో ప్రయాణికులు ప్రత్యామ్నాయ మార్గాల వైపు మళ్లుతున్నారు. నష్టాల నుండి బయటపడటానికి ప్రయాణికుల సంఖ్యను పెంచేందుకు మెట్రో సంస్థ చర్యలు తీసుకుంటోంది. ప్రతి సంవత్సరం స్మార్ట్‌కార్డుపై 24 లేదా అంతకంటే ఎక్కువ ట్రిప్పులు ప్రయాణించిన వారికి ‘గ్రీన్ ఛాంపియన్స్’ ట్రోఫీని అందజేస్తుండగా.. దీనిని మరింత ఆకర్షణీయంగా మార్చేందుకు మెట్రో సంస్థ ప్రస్తుతం ప్రయత్నాలు చేస్తోంది.