ఎన్టీఆర్ ట్రస్టు ఆధ్వర్యంలో విజయవాడలో నిర్వహించనున్న యుఫోరియా కార్యక్రమ వివరాలను నారా భువనేశ్వరి వెల్డించారు. ఎన్టీఆర్ స్ఫూర్తితో ట్రస్టు ఏర్పాటు చేశఆమని.. రక్తదాన కార్యక్రమాల్లో అందరూ పాల్గొనాలని.. అది చాలా మంది జీవితాలను నిలబెడుతుందన్నారు. ఫండ్ రైజింగ్ కోసం మ్యూజికల్ నైట్ కార్యక్రమం నిర్వహిస్తున్నామని.. దీన్ని నిర్వహించేందుకు తమన్ ముందుకొచ్చారని.. అందరూ సమాజానికి ఉపయోగపడే సేవా కార్యక్రమాలు చేయాలన్నారు. 'మనం చేసిన మంచి పనులే మనతో ఉంటాయి' అన్నారు. తమన్ వంటి వ్యక్తులు చాలా అరుదుగా ఉంటారని ప్రశంసించారు.