తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా.. శనివారం (మార్చి 22న) రోజు సభలో పాడి కౌశిక్ రెడ్డికి, మంత్రి సీతక్కకు మధ్య ఆసక్తికర చర్చ జరిగింది. రైతుల సమస్యలు, రైతు రుణమాఫీ, బోనస్ వంటి అంశాలపై ప్రభుత్వాన్ని ప్రశ్నించిన పాడి కౌశిక్ రెడ్డికి సమాధానం ఇస్తూ.. మంత్రి సీతక్క తనదైన శైలిలో కౌంటర్ ఇచ్చారు. తన జీవన విధానం వేరని.. కౌశిక్ రెడ్డి లైఫ్ స్టైల్ వేరంటూ.. చురకలంటించారు. ఈ క్రమంలోనే.. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలంతా తన ఇంటికి భోజనానికి రావాలంటూ ఆహ్వానించారు కూడా.