AP Govt Key Suggestions Thalliki Vandanam: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న 'తల్లికి వందనం' పథకంలో కొన్ని సాంకేతిక సమస్యలు తలెత్తాయి. లబ్ధిదారుల జాబితాలో తప్పులు దొర్లడంతో పాటు, కొందరి ఖాతాల్లో డబ్బులు జమ కావడం లేదు. మరికొందరికి బ్యాంకులు పాత బకాయిల కింద ఆ మొత్తాన్ని జమ చేసుకుంటున్నాయి. అయితే, అర్హులైన ప్రతి ఒక్కరికీ పథకం అందుతుందని ప్రభుత్వం హామీ ఇస్తోంది. సమస్యల పరిష్కారం కోసం సచివాలయాల్లో ఫిర్యాదు చేయాలని సూచించింది.