ఏపీలో తల్లికి వందనం పథకం అమలుపై మంత్రి నిమ్మల రామానాయుడు క్లారిటీ ఇచ్చారు. ఇచ్చిన మాట ప్రకారం త్వరలోనే తల్లికి వందనం పథకాన్ని అమలు చేస్తామని ప్రకటించారు. వైసీపీ అధినేత వైఎస్ జగన్ చేస్తున్న విమర్శలకు కౌంటర్ ఇచ్చిన రామానాయుడు.. వైసీపీ అధికారంలోకి వచ్చిన ఎన్ని నెలల తర్వాత అమ్మ ఒడి అమలు చేసిందో గుర్తు చేసుకోవాలన్నారు. తల్లికి వందనం గురించి మాట్లాడే హక్కు, అర్హత జగన్‌కు లేదంటూ ఎద్దేవా చేశారు. ఇచ్చిన హామీ ప్రకారం ఇంట్లో ఎంతమంది బడికి వెళ్లే పిల్లలు ఉంటే వారందరికీ రూ.15000 చొప్పున అందిస్తామని స్పష్టం చేశారు.