ఏపీ ప్రభుత్వం అమలు చేస్తున్న తల్లికి వందనం పథకంలో కొత్త రికార్డులు నమోదవుతున్నాయి. ఇంట్లో అర్హులైన వారు ఎంతమంది ఉంటే అందరికీ తల్లికి వందనం అందిస్తున్నారు. ఈ క్రమంలోనే అన్నమయ్య జిల్లా కలకడ పట్టణంలోని ఓ కుటుంబానికి ఏకంగా రూ.1.56 లక్షలు తల్లికి వందనం కింద సాయం అందింది. కలకడలోని ఉమ్మడి కుటుంబంలో 12 మంది విద్యార్థులకు తల్లికి వందనం కింద నగదు జమైంది. దీంతో ఆ కుటుంబసభ్యులు సంతోషం వ్యక్తం చేస్తూ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేశారు. అనంతపురం జిల్లాలో ఒకే కుటుంబంలోని ఆరుగురు విద్యార్థులకు కూడా తల్లికి వందనం సాయం అందుతోంది.