తెలంగాణ ఆర్టీసీ చైర్మన్ వీసీ సజ్జనార్ ఎక్స్‌లో ఒక వీడియో పోస్ట్ చేశారు. ఆ వీడియోలో ఉన్నది ఒక సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్. ఇతను ఒక మోటార్‌సైకిల్ రైడర్. వేర్వేరు ప్రదేశాల్లో పర్యటిస్తూ వీడియోలు పోస్ట్ చేస్తూ ఉంటాడు. ఇతడికి చాలా మంది ఫాలోవర్లు ఉన్నారు. అయితే, తన నెక్ట్స్ రైడ్ కోసం ఒక కొత్త కెమెరా కొనడానికి షాప్‌కి వెళ్లాడు. అక్కడ ఒక కెమెరాను సెలెక్ట్ చేసుకున్నాడు. అయితే, ఆ కెమెరాకు తన జేబులో డబ్బులు ఇవ్వకుండా.. ఒక బెట్టింగ్ యాప్‌లో అప్పటికప్పుడు డబ్బులు పెట్టి 96 వేలు గెలుచుకున్నానని.. ఆ డబ్బుల్లోంచి కెమెరాకు డబ్బులు కట్టేశానని చెబుతున్నాడు. తన టెలీగ్రామ్ ఛానెల్ ద్వారా డైలీ ప్రెడిక్షన్ ఇస్తున్నానని.. మీరు గట్టిగా ఎర్న్ చేసుకోవచ్చని ఫాలోవర్లకు సలహా ఇస్తున్నాడు. అంటే మీరు కూడా ఈ బెట్టింగ్ యాప్‌లో డబ్బులు పెట్టండి అని చెబుతున్నాడు. దీన్ని వీసీ సజ్జనార్ తప్పుబట్టారు. ఇంతకన్నా దిక్కుమాలినపని ఏమైనా ఉంటుందా అని ప్రశ్నించారు.