ఏపీలో అత్యంత ఆసక్తి రేకెత్తించిన తిరుపతి డిప్యూటీ మేయర్ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి గెలుపొందారు. తిరుపతి డిప్యూటీ మేయర్‌గా కూటమి అభ్యర్థి మునికృష్ణ ఎన్నికయ్యారు. అలాగే నందిగామ మున్సిపల్ ఛైర్‌పర్సన్‌గా టీడీపీ అభ్యర్థి మండవ కృష్ణకుమారి ఎన్నికయ్యారు. సోమవారం పలుచోట్ల ఎన్నికలు నిర్వహించగా.. కోరం లేకపోవటంతో కొన్నిచోట్ల మంగళవారానికి వాయిదా పడింది. ఈ క్రమంలోనే తిరుపతి డిప్యూటీ మేయర్, నందిగామ మున్సిపల్ ఛైర్‌పర్సన్ ఎన్నికలు మంగళవారం నిర్వహించారు.