తిరుపతి తొక్కిసలాట ఘటనపై ఏకసభ్య న్యాయ విచారణ కమిషన్ దర్యాప్తులో వేగం పెంచింది. ఇప్పటికే బాధితులను వర్చువల్‌గా విచారించిన జస్టిస్ సత్యనారాయణమూర్తి.. శనివారం తిరుపతిలో పలు ప్రాంతాలను పరిశీలించారు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్, నారాయణగిరి ఉద్యానవనం సహా పలు ప్రాంతాలను పరిశీలించారు. భక్తులను క్యూలైన్లలోకి ఎలా వదులుతారనే దానిపై అధికారులను, సిబ్బందిని అడిగి వివరాలు తెలుసుకున్నారు. మరోవైపు తిరుపతి తొక్కిసలాట ఘఠనపై ఆరు నెలల్లోగా విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని ఏపీ ప్రభుత్వం ఆదేశించిన సంగతి తెలిసిందే.