భారత్ పాకిస్థాన్ సరిహద్దుల్లో ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. ఈ సమయంలో జాతి మొత్తం.. భారత సైన్యానికి మద్దతుగా నిలుస్తోంది. ఈ క్రమంలోనే తిరుపతికి చెందిన ఓ సామాన్యుడు దేశభక్తిని చాటుకున్నాడు. తన పుట్టినరోజు సందర్భంగా భారత ఆర్మీకి రూ.5 లక్షలు విరాళంగా అందించారు. మంగళం ప్రాంతానికి చెందిన జ్యోతికృష్ణ నాయుడు తన కష్టార్జితం నుంచి రూ.5 లక్షలు ఇండియన్ ఆర్మీకి విరాళంగా అందించారు. ఆర్మీ అధికారుల మధ్య పుట్టినరోజు జరుపుకున్న జ్యోతికృష్ణ.. ఆ తర్వాత విరాళానికి సంబంధించిన చెక్కు అందించారు.