Leopard Attack Biker In Tirupati: తిరుపతి అలిపిరి మార్గంలో జూపార్క్ రోడ్డులో బైక్‌పై వెళ్తున్న వ్యక్తిపై చిరుత దాడికి ప్రయత్నించడం కలకలం రేపింది. కేన్సర్ ఆస్పత్రి వద్ద పొదల మాటున ఉన్న చిరుత ఒక్కసారిగా దూకింది. అదృష్టవశాత్తు ఆ వ్యక్తి తప్పించుకున్నాడు. అరవింద్ ఆసుపత్రి దగ్గర చిరుత సంచరిస్తోందని, ప్రేమజంటలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గతంలో అన్నమయ్య భవనం వెనుక, అలిపిరి నడకదారిలో చిరుతలు కనిపించాయి.