సింహాద్రి అప్పన్న ఆలయంలో భారీగా అధికారులు నెయ్యిని సీజ్ చేశారు. నెయ్యి శాంపిల్స్ సేకరించి వాటిని పరీక్షల కోసం ల్యాబ్‌కు పంపించారు. అంతేకాకుండా అప్పన్న ప్రసాదంలో ఉపయోగించే ఇతర పదార్థాలను కూడా పరీక్షలు చేసేందుకు ల్యాబ్‌కు తరలించారు. తిరుపతి లడ్డూ తయారీలో జంతువుల కొవ్వు కలిపారని గత కొన్ని రోజులుగా వస్తున్న తీవ్ర ఆరోపణల వేళ.. తాజాగా సింహాద్రి అప్పన్న ఆలయంలో నెయ్యి సీజ్ చేయడం భక్తుల్లో తీవ్ర ఆందోళనను రేకెత్తిస్తోంది.