తిరుపతి నగరం మరో కార్యక్రమానికి వేదికైంది. తిరుపతి వేదికగా తెలుగు వికీపీడీయా పండుగ 2025 ఘనంగా జరిగింది. తెలుగు వికీపీడియా గ్రూపు సభ్యులు మూడు రోజుల పాటు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఫిబ్రవరి 14,15,16వ తేదీలలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా తెలుగు వికీపీడియాను మరింతగా విస్తరించడం ఎలా అనే దానిపై సభ్యులు చర్చించారు. అలాగే గత పదేళ్లలో తెలుగు వికీపీడియాకు విశేష సేవలు అందించిన వారిని సత్కరించారు. తిరుపతిలో తెలుగు వికీపీడీయా గురించి అవగాహన కార్యక్రమాలు చేపట్టారు.