Tirupati Hotel Ceiling Collapse: తిరుపతిలోని బస్టాండ్ సమీపంలోని మినర్వా గ్రాండ్ హోటల్‌లో సీలంగ్ కూలింది. రూమ్ నంబర్ 314లో ఒక్కసారిగా సీలింగ్ కుప్పకూలడంతో ఆ హోటల్‌లో ఉన్న భక్తులు భయాందోళనతో బయటకు పరుగులు తీశారు. ఈ ఘటనలో ఒక భక్తుడికి గాయాలయ్యాయి. వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకుని వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. హోటల్‌ను పోలీసులు సీజ్ చేశారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.