తిరుపతిలో సందడి చేసిన హీరోయిన్ మీనాక్షి చౌదరి

2 months ago 5
హీరోయిన్ మీనాక్షి చౌదరి తిరుపతిలో సందడి చేశారు. తిరుపతి, వి.వి.మహల్ రోడ్డులోని ఓ జ్యూవెలరీ షాప్ ఓపెనింగ్‌కు మీనాక్షి చౌదరి వచ్చారు. ఈ విషయం తెలుసుకున్న అభిమానులు హీరోయిన్‌ను చూసేందుకు భారీగా తరలివచ్చారు. ఈ సందర్భంగా మాట్లాడిన మీనాక్షి చౌదరి.. తాను నటించిన లక్కీ భాస్కర్, సంక్రాంతికి వస్తున్నాం సినిమాలను ప్రేక్షకులు విశేషంగా ఆదరించి ఘన విజయం అందించారని సంతోషం వ్యక్తం చేశారు. ప్రస్తుతం రెండు సినిమాలు చేస్తున్నానని, త్వరలో వాటి వివరాలను వెల్లడిస్తానని తెలిపారు. సినిమా స్టార్లకు కూడా కలలు, లక్ష్యాలు ఉంటాయని, రియల్ లైఫ్ లో రెండు లక్ష్యాలను చేరుకున్న తాను.., రీల్ లైఫ్‌లో తన కలను సాకారం చేసుకున్నానని అన్నారు.
Read Entire Article