తిరుపతి స్థానికులకు ముఖ్య గమనిక. జనవరి నెలకు సంబంధించిన స్థానిక దర్శన కోటా టోకెన్లను టీటీడీ జారీ చేయనుంది. జనవరి 5వ తేదీన తిరుమల శ్రీవారి స్థానిక దర్శన కోటా టికెట్లు జారీ చేయనున్నారు. తిరుపతితో పాటుగా, తిరుమలలో ఈ స్థానిక దర్శన కోటా టోకెన్లు జారీ చేస్తారు. ఈ టోకెన్లు పొందిన భక్తులను జనవరి 7వ తేదీన దర్శనానికి అనుమతిస్తారు. అయితే టోకెన్లు పొందడానికి వచ్చే సమయంలో ఒరిజినల్ ఆధార్ కార్డు వెంట తెచ్చుకోవాలని టీటీడీ సూచించింది. దర్శనం సమయంలోనూ ఒరిజినల్ ఆధార్ కార్డును తమ వెంట తీసుకురావాలని సూచించింది.