Dwaraka Tirumala Temple Gold Plating: ప్రముఖ పుణ్యక్షేత్రమైన ద్వారకాతిరుమల శ్రీవారి అంతరాలయం స్వర్ణ శోభితమైంది. స్వామివారి భక్తులకు కనువిందు చేస్తోంది. కృష్ణాజిల్లా, బాపులపాడు మండలం, బొమ్ములూరుకు చెందిన దీపక్ నెక్స్‌జెన్ ఫీడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ అడుసుమిల్లి వెంకట సుబ్రహ్మణ్యం, డైరెక్టర్లు రూ.1,64,19,411తో స్వామి అంతరాలయానికి బంగారు తాపడాన్ని చేయించారు. స్వర్ణ కాంతులతో ధగధగలాడుతున్న వాకిలి నుంచి చిన వెంకన్నను దర్శించుకుంటున్నారు భక్తులు. శని, ఆదివారాలు, భక్తులు భారీగా తరలి వస్తున్నారు.