Tirumala Ghat Road Accident: తిరుమల రెండో ఘాట్ రోడ్డులో రోడ్డు ప్రమాదం జరిగింి. బైక్‌ను ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది.. ఈ ప్రమాదంలో ఇద్దరు భక్తులు ప్రాణాలు కోల్పోయారు. రెండు మృతదేహాలు బస్సు కింద ఇరుక్కుపోగా.. జేసీబీ సాయంతో బయటకు తీశారు. చనిపోయినవారిని తమిళనాడుకు చెందినవారిగా చెబుతున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇటీవల కాలంలో తిరుమల రెండు ఘాట్ రోడ్లలో ప్రమాదాలు జరగడం ఆందోళన కలిగిస్తోంది.