Hyd Man Absconded From Tirumala:తిరుమలలోని గోగర్భం డ్యాం వద్ద వున్న ఓ మఠం వద్ద వివాహం విషయంలో వివాదం జరిగింది. తెలంగాణకు చెందిన రాకేష్ రెండో పెళ్ళి చేసుకునేందుకు ప్రయత్నించారు. విషయం తెలిసిన మొదటి భార్య సంధ్య అక్కడకు చేరుకుని వివాహాన్ని నిలిపివేశారు. కళ్యాణ మండపం వద్దకు సంధ్య రావడంతోనే రాకేష్, అతని కుటుంబ సభ్యులు అక్కడి నుంచి పరారయ్యారు. ఈ ఘటనపై తిరుమల పోలీసు స్టేషన్‌లో మొదటి భార్య సంధ్య ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు.