తిరుమలలో శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలకు అంగరంగ వైభవంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. సెప్టెంబర్ 24 నుంచి అక్టోబర్ రెండో తేదీ వరకూ బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఏర్పాట్లపై టీటీడీ ఏఈవో వెంకయ్య చౌదరి, తిరుపతి ఎస్పీ సుబ్బారాయుడు సమావేశం నిర్వహించారు. భక్తుల కోసం ఆర్టీసీ ద్వారా రోజూ 435 బస్సులు నడపాలని నిర్ణయించారు. అలాగే పార్కింగ్ సదుపాయం, భక్తుల భద్రతపై చర్చించారు.