తిరుమల శ్రీవారి భక్తులకు టీటీడీ కీలక ప్రకటన చేసింది. డిసెంబర్ నెలకు సంబంధించిన ఆర్జిత సేవలు, దర్శన టికెట్లు, వర్చువల్ సేవలు, ఉచిత ప్రత్యేక దర్శన టోకెన్లు, వసతి గదుల కోటా విడుదల తేదీలను ప్రకటించింది. ఈనెల 19 నుంచి వరుసగా 4 రోజుల పాటు వివిధ సేవలు, దర్శనాలు, గదుల బుకింగ్ కోటాలను ఆన్‌లైన్‌లో విడుదల చేయనున్నారు. సుప్రభాతం, తోమాల, అర్చన వంటి సేవల ఎలక్ట్రానిక్ డిప్‌తో పాటు రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు, వృద్ధులు, దివ్యాంగుల ఉచిత దర్శన టోకెన్లకు సంబంధించిన తేదీలు కూడా వెల్లడయ్యాయి.