తిరుమల లడ్డూ గురించి తెలంగాణకు చెందిన భక్తుడు చేసిన ఆరోపణలపై టీటీడీ స్పందించింది. లడ్డూ తింటుంటే నోట్లో గాయమైందని భక్తుడు ఆరోపించాడు. దీంతో అతడిని అంబులెన్స్‌లో ఆస్పత్రికి తరలించి మెడికల్ టెస్ట్‌లు చేయించారు. ఆ వైద్య పరీక్షల్లో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. లడ్డూ తినడం వల్ల ఆ భక్తుడికి నోట్లో గాయం కాలేదని.. తన నాలుకను తానే కొరుక్కోవడం వల్ల గాయమైనట్లు తేలింది. దీంతో ఆ భక్తుడు చేసిన ఆరోపణలను ఖండిస్తూ టీటీడీ ఒక ప్రకటన విడుదల చేసింది.