TTD Consent Letters Thiruppavai Parayanadars: హిందూ ధార్మిక ప్రాజెక్టుల ఆధ్వర్యంలో దేశంలోని వివిధ ప్రాంతాల్లో ప్రతి ఏటా ధనుర్మాసంలో తిరుప్పావై ఉపన్యాసాలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా అర్హులైనవారు అక్టోబరు 15వ తేదీ సాయంత్రం 5 గంటలలోపు అంగీకారపత్రాలను పంపాలని టీటీడీ సూచిస్తోంది. ఈ మేరకు టీటీడీ ప్రకటన విడుదల చేసింది. ఏదైనా సమాచారం కావాలంటే తమ ఫోన్ నంబర్లు, వెబ్‌సైట్ వివరాలను కూడా టీటీడీ పొందుపరిచింది.