Tirumala Srivari Mettu Counter Shifted To Alipiri: తిరుమల శ్రీవారి దర్శనానికి కాలినడకన వెళ్లే భక్తులకు టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. శ్రీవారి మెట్టు వద్ద ఇచ్చే దివ్యదర్శనం టోకెన్ల జారీని అలిపిరి భూదేవి కాంప్లెక్స్‌కు మార్చారు. ఆటోవాలాల మోసాలను అరికట్టేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇకపై భక్తులు అలిపిరిలోనే టోకెన్లు పొందవచ్చు. ఆధార్ కార్డు చూపించి టోకెన్లు తీసుకోవాలని, శ్రీవారి మెట్టు మార్గంలో స్కాన్ చేసుకోవాలని టీటీడీ తెలిపింది.