Tirumala Appeal Devotees On Book Darshan Tickets: తిరుమల శ్రీవారి భక్తులు దర్శన టికెట్లు, ఆర్జిత సేవా టికెట్లు, వసతి గదుల గురించి టీటీడీ కీలక ప్రకటన చేసింది. ఈ మేరకు దర్శనం, ఆర్జిత సేవలు, వసతి గదుల విషయంలో నకిలీ వెబ్‌సైట్లను నమ్మి మోసపోవద్దని టీటీడీ ఒక ప్రకటనలో తెలిపింది. భక్తులు కేవలం టీటీడీ అధికారిక వెబ్‌సైట్ ద్వారా మాత్రమే వినియోగించాలని సూచించింది. ఇప్పటికే కొన్ని నకిలీ వెబ్‌సైట్లపై క్రిమినల్ కేసులు నమోదు చేసినట్లు తెలిపారు.