Tirumala Darshan Tickets Cheating: తిరుమల శ్రీవారి దర్శనం కోసం వెళ్లే భక్తులు జాగ్రత్తగా ఉండాలని టీటీడీ పదే, పదే చెబుతోంది. దళారుల్ని నమ్మి మోసపోవద్దని హెచ్చరిస్తూనే ఉన్నారు.. అయినా సరే కొందరు మోసపోతూనే ఉన్నారు. తాజాగా మరో ముగ్గురు భక్తులు మోసపోయారు.. వారు టీటీడీ విజిలెన్స్ వింగ్‌ను సంప్రదించగా ఇద్దరు వ్యక్తుల్ని పోలీసులు అరెస్ట్ చేశారు. మోసపోయిన వారిలో నిజామాబాద్‌కు చెందిన భక్తుడు.. అలాగే బెంగళూరుకు చెందిన ఇద్దరు భక్తులు ఉన్నారు.