Tirumala Srivari Mettu Devotees Tokens: తిరుమల శ్రీవారి మెట్టు దగ్గర దివ్య దర్శనం టోకెన్ల విషయంలో ఆటోవాలలతో భక్తులకు తిప్పలు తప్పడం లేదు. శ్రీవారి మెట్టు మార్గం శని, ఆది వారాలలో భక్తులతో రద్దీగా కనిపిస్తోంది. టైమ్ స్లాట్ టోకెన్లు ఇప్పిస్తామని తిరుపతి నుంచి శ్రీవారి మెట్టుకు భక్తులను ఆటోవాలలతో తరలిస్తున్నారు. ఒక్కో ఆటో డ్రైవర్ 5 లేక 7 మంది భక్తుల నుంచి రూ.ఐదు వేలకు పైగా వసూల్ చేస్తున్నారు. దీంతో శ్రీవారిమెట్టు మార్గం వద్దకు శ్రీవారి భక్తులు భారీగా చేరుకుంటున్నారు. ఆటోవాలల దందాతో శని, ఆది వారాలలో శ్రీవారి మెట్టు వద్ద భక్తులు ఎక్కువమంది ఉ:టున్నారు.