Tirumala Srivari Seva Online Booking On August 27th: తిరుమల శ్రీవారికి సంబంధించి.. శ్రీవారి సేవ కోటాను టీటీడీ విడుదల చేయనుంది. ఆగష్టు 27న తిరుమల – తిరుపతి శ్రీవారి సేవ కోటా ఉదయం 11 గంటలకు, నవనీత సేవ మధ్యాహ్నం 12 గంటలకు, పరకామణి సేవ మధ్యాహ్నం 1 గంటకు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది. భక్తులు ఈ విషయాన్ని గమనించి టికెట్లు బుక్ చేసుకోవాలని టీటీడీ సూచించింది. తిరుమల, తిరుపతి శ్రీవారి సేవకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.