Whatsapp Governance TTD Services: టీటీడీ సేవలకు సంబంధించి ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక ప్రకటన చేశారు. వాట్సాప్ గవర్నెన్స్‌లోకి తిరుమల తిరుపతి దేవస్థానం సేవల్ని త్వరలోనే తీసుకొస్తామన్నారు. అలాగే కేంద్రంతో సంప్రదించి రైల్వే టికెట్లు కూడా వాట్సాప్ గవర్నెన్స్‌లోకి అందుబాటులోకి తెస్తామన్నారు. సినిమా టికెట్లు అందించే సదుపాయాన్ని కూడా పరిశీలించాలని అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ పనితీరుపై ప్రజాభిప్రాయాన్ని కూడా వాట్సాప్ గవర్నెన్స్ ద్వారానే సేకరించాలని చంద్రబాబు కీలక సూచనలు చేశారు.