Tirumala Darshan Tickets Release: టీటీడీ ప్రతి నెలా తిరుమల శ్రీవారి ఆర్జిత సేవలు, దర్శనం, వసతి గదుల్ని విడుదల చేస్తోంది. తాజాగా డిసెంబర్ నెలకు సంబంధించి ఆన్‌లైన్ కోటాను విడుదల చేస్తోంది. ఇప్పటికే ఆర్జిత సేవా కోటా విడుదల చేశారు. ఇవాళ శ్రీవాణి ట్రస్ట్, వయోవృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధులున్నవారికి దర్శన టికెట్లను విుడదల చేస్తారు. ఈ నెల 24న తిరుమల శ్రీవారి రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లను టీటీడీ విడుదల చేస్తుంది.