Tirumala Rs 300 Darshan Tickets Release: తిరుమల శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లకు సంబంధించిన నవంబరు నెల కోటాను టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేస్తోంది. ఇవాళ అంగ ప్రదక్షిణం, వయోవృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధులున్నవారి దర్శన టికెట్లను టీటీడీ విడుదల చేస్తుంది. శనివారం ఉదయం రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లు.. మధ్యాహ్నం తిరుమల, తిరుపతిలో వసతి గదుల కోటాను టీటీడీ విడుదల చేయనుంది. భక్తులు ఈ విషయాన్ని గమనించి బుక్ చేసుకోవాలని టీటీడీ సూచించింది. టికెట్లకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.