తిరుమల పుణ్యక్షేత్రాన్ని ఆధ్యాత్మిక నగరాలకు ఆదర్శంగా ఉండేలా చర్యలు తీసుకుంటున్నామని టీటీడీ ఈవో శ్యామలరావు తెలిపారు. ఆదివారం విలేకర్ల సమావేశం నిర్వహించిన ఆయన.. పలు కీలక వివరాలు వెల్లడించారు. ఆనధికారిక దుకాణాల కారణంగా తిరుమలకు వచ్చే శ్రీవారి భక్తులు ఇబ్బందులు పడుతున్నారన్న ఈవో.. భక్తుల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని హాకర్లు, అనధికారిక దుకాణాలపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. తిరుమలలో ప్రసాదాల తయారీకి రిలయన్స్ సంస్థతో ఒప్పందం చేసుకున్నామని.. ముడిసరుకులను వారే సరఫరా చేస్తారని టీటీడీ ఈవో చెప్పారు.