Tirumala Darshan SSD Tokens Re Start: తిరుమలలో రథసప్తమి వేడుకలు వైభవంగా నిర్వహించారు.. సప్తవాహనాలపై శ్రీవారు దర్శనం ఇవ్వగా.. వేలాదిమంది భక్తులు శ్రీవారిని దర్శించుకునేందుకు భారీగా తరలివచ్చారు. అయితే తిరుమలలో రథసప్తమి కావడంతో టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. మూడు రోజుల పాటూ తిరుపతిలో జారీ చేసే SSD టోకెన్లను నిలిపివేసింది. అయితే రథసప్తమి ముగియడంతో.. తిరుపతిలోని కౌంటర్‌లలో మళ్లీ SSD టోకెన్లను జారీ చేస్తుంది. భక్తులు ఈ విషయాన్ని గమనించాలి.