తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి కేసులో సంచలనం.. నలుగురు అరెస్ట్

2 months ago 3
CBI Sit Arrested Four Persons In Tirumala Laddu Prasadam Case: తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదానికి కల్తీ నెయ్యి సరఫరా చేసిన కేసులో నలుగురు నిందితుల్ని సీబీఐ సిట్ అరెస్టు చేసింది. ఉత్తరాఖండ్‌లోని రూర్కీలో ఉన్న బోలేబాబా ఆర్గానిక్‌ డెయిరీ డైరెక్టర్లు విపిన్‌ జైన్‌, పోమిల్‌.. తిరుపతి జిల్లా పెళ్లకూరు మండలం పెనుమాకలోని వైష్ణవి డెయిరీ స్పెషాలిటీస్‌ లిమిటెడ్‌ సీఈవో అపూర్వ వినయ్‌కాంత్‌, తమిళనాడులోని దిండిగల్‌లో ఉన్న ఏఆర్‌ డెయిరీ మేనేజింగ్‌ డైరెక్టర్‌ రాజు రాజశేఖరన్‌ను అరెస్టు చేశారు. అదనపు జ్యుడీషియల్‌ మేజిస్ట్రేట్‌ ప్రవీణ్‌కుమార్‌ నివాసానికి తీసుకెళ్లారు. నలుగురికీ జ్యుడీషియల్‌ రిమాండ్‌ విధించడంతో.. తిరుపతి సబ్‌ జైలుకు తరలించారు.
Read Entire Article