తిరుమలలో అపచారం అంటూ సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ అవుతోంది. తిరుమలలో మరో అపచారం.. శ్రీవారి సన్నిధిలోనే మద్యం తాగుతున్న మందుబాబులు అంటూ వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది. మద్యం తాగి.. ఆ ఖాళీ మందుబాటిళ్లను మెట్లపైకి విసిరేస్తున్నారంటూ ఆ వీడియోలో ఉంది. అయితే ఈ ఘటనపై తిరుమల తిరుపతి దేవస్థానం స్పందించాల్సి ఉంది. ఇది నిజంగానే తిరుమలలో జరిగిందా.. లేదా ఎవరైనా కావాలని వైరల్ చేస్తున్నారా అనేది తెలియాల్సి ఉంది.