తిరుమల శ్రీవారి దర్శనానికి దేశ విదేశాల నుంచి భక్తులు వస్తుంటారు. స్వామివారిని దర్శించుకుని తరిస్తూ ఉంటారు. అయితే శ్రీవారి సేవకురాలిగా పనిచేసేందుకు, శ్రీవారి సేవ కోసం ఖండాలు దాటి వచ్చిందో మహిళ. లండన్‌లో ఆర్థిక సలహాదారుగా పనిచేస్తు్న్న రీతూ వక్కలంక అనే భక్తురాలు శ్రీవారి సేవ కోసం యూకే నుంచి తిరుమలకు వచ్చారు.30 రోజుల పాటు శ్రీవారి సేవ చేయనున్నారు. మరోవైపు రీతూ వక్కలంకను టీటీడీ ఈవో, ఏఈవో అభినందించారు. శ్రీవారి సేవ కోసం ఖండాలు దాటి రావటం అభినందనీయమన్నారు.