Tirumala Specially Abled Persons Darshan: తిరుమల శ్రీవారి సేవలో చెన్నైకు చెందిన ప్రత్యేక ప్రతిభావంతులు దర్శించుకున్నారు. టీటీడీ తమిళనాడు అడ్వయిజరీ కమిటీ, చెన్నై రోటరీ అసోసియేషన్ సంయుక్త ఆధ్వర్యంలో 1008 మంది అంధులు, మూగ, దివ్యాంగులు, అనాథ పిల్లలు సోమవారం సాయంత్రం తిరుమల వేంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు. వారితో పాటు 495 మంది వాలంటీర్లున్నారు. విభిన్న ప్రతిభావంతులు కావడంతో గత ఏడాది తరహాలోనే టీటీడీ సోమవారం కూడా ఉచితంగా దర్శనం కల్పించింది. అధికారులు, సిబ్బంది దగ్గరుండి దర్శనం చేయించారు