తిరుమల శ్రీవారిని హీరో కార్తీ దర్శించుకున్నారు. మంగళవారం ఉదయం వీఐపీ విరామ సమయంలో కుటుంబ సభ్యులతో కలసి స్వామి వారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో వేదపండితులు వేదశీర్వచనం అందించగా.. ఆలయ అధికారులు శ్రీవారి తీర్థప్రదడ్లు అందజేసి శేష వస్త్రంతో సత్కరించారు. శ్రీవారిని దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు కార్తీ. కుమారుడు పుట్టిన అనంతరం దర్శనానికి రాలేదని.. కుమారుడితో కలసి శ్రీవారిని దర్శించుకోవడం ఎంతో ఆనందాన్ని ఇచ్చిందన్నారు. నలన్ కుమారస్వామి దర్శకత్వంలో వా వాతియార్ సినిమాలో హీరోగా పాత్ర పోషిస్తున్నట్లు తెలిపారు. మిత్రన్ దర్శకత్వంలో దర్శకత్వంలోనే సర్దార్-2 చేస్తున్నట్లు తెలియజేశారు. ఇక లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో ఖైదీ-2 చేస్తున్నట్లు ప్రకటించారు.