టీటీడీకి మరోసారి ద్విచక్రవాహనాలు విరాళంగా అందాయి. చెన్నెకి చెందిన టీవీఎస్, బెంగళూరు ఎన్‌డీఎస్ ఎకో సంస్థ ప్రతినిధులు ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలను విరాళంగా అందించారు. ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం టీటీడీ ఏఈవో వెంకయ్య చౌదరి చేతికి వాహనాల తాళాలను విరాళంగా అందజేశారు. టీవీఎస్ అందించిన ద్వి చక్రవాహనం విలువ రూ.2.70 లక్షలు కాగా.. ఎన్‌డీఎస్ ఎకో సంస్థ రూ.1.56 లక్షల విలువైన ద్విచక్ర వాహనాన్ని టీటీడీకి విరాళంగా సమర్పించుకుంది.