TTD 100 Cycles Donated: తిరుమల శ్రీవారికి ప్రతిరోజూ భక్తులు కానుకల్ని, విరాళాలను అందిస్తుంటారు. తాజాగా తిరుమల శ్రీవారికి చెన్నైకి చెందిన మురుగప్ప గ్రూప్ టీఐ సైకిల్స్ ఆఫ్ ఇండియా సంస్థ విరాళం అందించింది. మొత్తం 100 సైకిళ్లను టీటీడీకి విరాళంగా అందజేసింది. అలాగే తిరుమలలో శ్రీ మలయప్పస్వామివారి వసంతోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. వసంత మండపంలో శ్రీదేవి భూదేవి సమేతంగా స్వామివారు ఊరేగింపుగా వేంచేపు చేశారు, స్నపన తిరుమంజనం కన్నుల పండుగగా జరిగింది.