తిరుమల శ్రీవారికి అశోక్ లేలాండ్ సంస్థ రూ.35 లక్షల విలువైన 41 సీట్ల ఏసీ బస్సును విరాళంగా అందజేసింది. ఈ సందర్భంగా ఆలయ అధికారులు సంస్థ ప్రతినిధులను అభినందించారు. ఇదిలా ఉండగా, తిరుపతి గోవిందరాజస్వామి ఆలయ అనుబంధ లక్ష్మీనారాయణస్వామి ఆలయంలో జూన్ 26 నుంచి జూలై 5 వరకు పెరియాళ్వార్ ఉత్సవం వైభవంగా జరగనుంది. చివరి రోజున గరుడ వాహనంపై గోవిందరాజస్వామి, గజ వాహనంపై పెరియాళ్వార్ ఊరేగి భక్తులకు దర్శనమిస్తారు.