Chandrababu on Mumtaz Hotel Permission: ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శుక్రవారం తిరుమలలో పర్యటించారు. మనవడు నారా దేవాన్ష్ పుట్టినరోజు సందర్భంగా కుటుంబంతో కలిసి శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం టీటీడీ అధికారులతో సీఎం చంద్రబాబు సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా తిరుమల కొండలకు సమీపంలో చేపడుతున్న ముంతాజ్ హోటల్ అనుమతులు రద్దు చేస్తున్నట్లు చంద్రబాబు ప్రకటించారు, ముంతాజ్ హోటల్‌కు గతంలో ఇచ్చిన అనుమతులు రద్దు చేస్తున్నట్లు చంద్రబాబు తెలిపారు. అలాగే టీటీడీలో అందరూ హిందూ ఉద్యోగులు ఉండేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు.